Beast : బీస్ట్ సినిమా నచ్చలేదని అభిమానులు చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Beast : తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం బీస్ట్. ఈ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహించారు.ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తమిళనాడులో రాత్రి నుంచే థియేటర్ల వద్ద హంగామా చేశారు. సినిమాపై భారీ అంచనాలతో థియేటర్స్ కి వెళ్లారు.తమ అభిమాన హీరో సినిమా విడుదలవుతుందంటే ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండదు.

థియేటర్ల ముందు భారీ కటౌట్లు ఏర్పాటు చేసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి థియేటర్ల ముందు క్యూ కడుతుంటారు.ఇక సినిమాపై భారీ అంచనాలతో అభిమానులు థియేటర్స్ కి వెళ్లారు.అయితే ఈ సినిమాకి మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ మొదలైంది. సినిమా బాలేదని మండిపడుతున్నారు అభిమానులు, ఎన్నో ఆశలతో థియేటర్ కు వెళితే చివరికి నిరాశతో వెనుదిరిగి రావాల్సి వస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.సినిమాపై నెగిటివ్ టాక్ రావడంతో విజయ్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో తమిళనాడులోని థియేటర్ లో సినిమా చూస్తున్న కొందరు ఫ్యాన్స్ కు ‘బీస్ట్’ సినిమా నచ్చకపోవడంతో స్క్రీన్ కి నిప్పంటించారు.దీంతో ఒక్కసారిగా థియేటర్ లో ఆందోళన ఏర్పడింది. విజయ్ అభిమానులు థియేటర్ స్క్రీన్ కి నిప్పు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సినిమా నచ్చకపోతే థియేటర్ కి నష్టం కలిగిస్తారా అంటూ విజయ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.