Bheemla Nayak: భీమ్లా నాయక్ విడుదల సందర్భంగా బండ్ల గణేష్ ట్వీట్…. మీకోసం చరిత్ర దేవర అంటూ ట్వీట్!

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్బంగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 23 న యూసుఫ్ గూడా హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ కు తెలంగాణ రాజకీయ ప్రముఖులు KTR, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్ హాజరయ్యారు . ఇక పవన్, రానాల స్పీచ్ ఆకట్టుకుంది. ఇక సినిమా మేకింగ్ లో కీలక పాత్ర పోషించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈవెంట్ లో ఉన్న మాట్లాడక పోవడం ఫాన్స్ ను నిరాశ పరిచింది.

ఇక త్రివిక్రమ్ తర్వాత ఫ్యాన్స్ ఎదురు చూసే స్పీచ్ బండ్ల గణేష్ దే. అయితే బండ్ల గణేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు.
ఈవెంట్ కు రెండు రోజుల ముందు విడుదలైన ఆడియో కలకాలం రేపింది. బండ్ల గణేష్ వైరల్ అయినా ఆడియో లో తనకు ఆహ్వానం అందకుండా త్రివిక్రమ్ చేసాడని ఆ ఆడియోలో అన్నారు. అయితే ఆడియో లో ఉన్న వాయిస్ నాది కాదని బండ్ల గణేష్ వివరించినా ఈవెంట్ కు రాకపోవడంతో అది నిజమేనేమో అనే అనుమానాలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి.

అయితే ఇవాళ చేసిన ట్వీట్ ఫ్యాన్స్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ‘మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ .. చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర.. ’ అంటూ భీమ్లా నాయక్ సినిమా మీద బండ్ల గణేష్ ట్వీట్ వేశాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.