సినిమా ఎప్పుడు చేయాలో తెలియని వాళ్లు కూడా సినిమాలు చేస్తున్నారు: బండ్ల గణేష్

టాలీవుడ్ ఇండస్ట్రీలో బండ్ల గణేష్ అంటే పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. మొదట కమేడియన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బండ్లగణేష్ ఎన్నో సినిమాలలో నటించి కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను కూడా నిర్మించాడు. అంతేకాకుండా రాజకీయాలలో రాణించాలని కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఇక సినిమాల నిర్మాణ విషయంలో కూడా బండ్ల గణేష్ కొంచెం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ చేసే వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ తర్వాత బండ్ల గణేష్ సంచలన నిర్మాతగా గుర్తింపు పొందాడు. ఏ విషయమైనా అందరి ముందు సూటిగా మాట్లాడే బండ్ల గణేష్ ఇటీవల చోర్ బజార్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ఇటీవల ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయంపై మరల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రొడ్యూసర్ గిల్డ్ అనేది ఒక నిరుపయోగమైన వ్యవస్థ అని , సినిమాలు తీయడం రాని వాళ్లు కూడా గిల్డ్‌లో ఉంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇండస్ట్రీలో ఫిల్మ్ చాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు వాటికి కట్టుబడి ఉండాలి. అంతేకానీ హీరోలని డైరెక్టర్‌లని రెమ్యునరేషన్ తగ్గించుకోమనే అర్హత ఎవరికి లేదు అంటు చెప్పుకొచ్చాడు.

ఇండస్ట్రీలో ఉన్న హీరోల రేంజ్ ని బట్టి వారి రెమ్యూనరేషన్ ఉంటుంది. ఈ క్రమంలో వారి రెమ్యూనరేషన్ తగ్గించుకోమని నిర్ణయించటానికి వారెవరు. కాల్ షీట్లకి, షీట్లకు తేడా తెలియని నిర్మాతలు కొందరు సినిమాలు తీస్తున్నారు అంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న రిలేషన్ చెడినట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిన బండ్ల గణేష్ వారసత్వంతో పాటు టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అవుతారని ఎన్టీఆర్ , మహేష్ బాబు లాంటి వారికి బ్యాక్ గ్రౌండ్ తో పాటు టాలెంట్ ఉండటం వల్ల ఇప్పుడు స్టార్ హీరోలుగా ఎదిగారని పోస్ట్ చేశాడు. దీంతో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ పేర్లు అక్కడ మెన్షన్ చేయకపోవడంతో వారి ఫ్యాన్స్ బండ్ల గణేష్ పై ఫైర్ అవుతున్నారు.