బడా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మామూలుడో కాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి.. బడా బడా హీరోలతో బడా బడా చిత్రాలను నిర్మించాడు. బాక్సాఫీస్‌ను షేక్ చేసే గబ్బర్ సింగ్, బాద్‌షాలను నిర్మించాడు. ఒకానొక సమయంలో బండ్ల గణేష్ స్పీడ్ చూసి టాలీవుడ్ అగ్ర నిర్మాతలు కూడా ఖంగుతిన్నారు. అయితే ఏమైందో తెలియదు గానీ వెంటనే స్పీడ్ తగ్గించేశాడు. ఆ వెంటనే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు.
రాజకీయాల్లో ఘోరమైన పరాభావాన్ని చవిచూశాక.. సినిమా రంగమే బెస్ట్ అనుకుని మళ్లీ ఇటువైపు వచ్చాడు. అలా వచ్చినవాడు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మంచి కమ్ బ్యాక్ అవుతుందని ఆశించాడు. అయితే ఆ సినిమా హిట్ అయినా బండ్ల గణేష్‌కు మాత్రం పేరు రాలేదు. పేరు రాకపోయినా పర్లేదు.. గానీ ఉన్న పేరు కాస్తా పోయింది. అలాంటి పాత్రలో బండ్ల గణేష్ ఏంటని అందరూ కామెంట్ చేశారు.
అందుకే ఇకపై సినిమాల్లో నటించ కూడదు.. నిర్మించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. తీస్తే భారీ బడ్జెట్ చిత్రమే తీస్తా అది కూడా పెద్దోళ్లతోనే తీస్తానని నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టే ప్లాన్ వేశాడు. సక్సెస్ అయ్యాడు. తాజాగా తన తదుపరి చిత్రం గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. నా భవిష్యత్‌కు సంబంధించిన ఓ విషయాన్ని ప్రకటిస్తానని ట్వీట్ చేయడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. నెటిజన్ల ఆసక్తి, ఆలోచనలకు తగ్గట్టే ఆ అప్డేట్‌ను ఇచ్చాడు. గబ్బర్ సింగ్ లాంటి సినిమా చేయండని అభిమానులు కోరడంతో పవన్ కళ్యాణ్‌ను ఒప్పించేశాడు. ఓ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిపాడు.