మెగా మెనల్లుడు ని ఒప్పించిన బండ్ల గణేష్ ..?

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ అంతక ముందు వరసగా ఫ్లాపుల్లో ఉండి కెరీర్ కాస్త డౌన్ అయింది. అయితే మళ్ళీ చిత్రలహరి, ప్రతీ రోజూపండగే సినిమాలతో వరసగా రెండు హిట్స్ అందుకొని ట్రాక్ ఎక్కాడు. కాగా హ్యాట్రిక్ హిట్ కోసం చేసిన సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమా రీసెంట్ గా సెన్సార్ క్యార్యక్రమాలని పూర్తి చేసుకొని థియోటర్ రిలీజ్ కి రెడీగా ఉంది. క్లీ యు సర్టిఫికెట్ తెచ్చుకున్న సోలో బ్రతుకే సో బెటర్ తో మరో హిట్ అందుకోబోతున్నాడు సాయి ధరం తేజ్ అన్న టాక్ వినిపిస్తుండగా డిసెంబర్ లో క్రిస్మస్ పండుగ కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

solo brathuke so better full movie download leaked by movierulz

ఇక ఈ సినిమా తర్వాత కూడా ఈ మెగా మేనల్లుడు వరసగా ప్రాజెక్ట్స్ కమిటవుతూ మంచి దూకుడు మీద ఉన్నాడు. ఇప్పటికే దేవాకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రీసెంట్ గా సెట్స్ మీదకి వచ్చింది. జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2021 లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ సినిమా చేయనున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే గోపాలకృష్ణ అనే కొత్త దర్శకుడితో ‘భగవద్గీత సాక్షిగా’ అన్న సినిమా చేయడానికి ఇంతకముందే సాయి ధరం తేజ్ కమిటై అధికారకంగా ప్రకటన కూడా వచ్చింది.

అయితే తాజా సమాచారం ప్రకారం బండ్ల గణేష్ నిర్మాణంలో సాయి ధరం తేజ్ ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సాయి ధరం తేజ్ డేట్స్ కోసం బండ్ల గణేష్ చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ తో నూ ఒక సినిమా నిర్మిస్తున్నట్టు వెల్లడించిన బండ్ల గణేష్ ఈ రెండు ప్రాజెక్ట్స్ ని ఒకేసారి ప్రారంభించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలో రానుందట.