పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ మధ్య ఉన్న బంధం, అనుబంధం, సంబంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరిది ఎన్నో యేళ్ల అనుబంధం. పవన్ కళ్యాణ్ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచీ వెంటే ఉంటూ వస్తున్నాడు బండ్ల గణేష్. ఆ చొరవ, స్నేహం, ప్రేమతో బండ్లను నిర్మాతగా మార్చాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌తో తీన్‌మార్ సినిమాను తీశాడు బండ్ల గణేష్. ఆ చిత్రం అనుకున్నంతగా సక్సెస్ కాకపోయే సరికి మరో అవకాశం కూడా ఇచ్చాడు.
గబ్బర్ సింగ్ సినిమాను నిర్మించే అవకాశం బండ్ల గణేష్‌కు ఇచ్చాడు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ దెబ్బతో బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్‌గా మారిపోయాడు. ఇక వరుసగా చిత్రాలను నిర్మిస్తూ.. స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్‌లు ఇస్తుండటంతో బడా ప్రొడ్యూసర్‌గా మారిపోయాడు. అయితే మధ్యలో రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో బండ్ల గణేష్ సినిమాలకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.
రాజకీయాల్లో బోల్తా పడ్డాక మళ్లీ సినిమా రంగం వైపు ఆశగా చూశాడు బండ్ల గణేష్. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో చేసిన పాత్రకు నెగెటివ్ టాక్ రాగా.. ఇక సినిమాల్లో నటించడం కాదు, కేవలం సినిమాలను నిర్మించాలని ఫిక్స్ అయ్యాడట. ఓ భారీ బడ్జెట్, స్టార్ హీరో కోసం అన్వేషిస్తున్నాడట. ఈ క్రమంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ చెప్పిన సమాధానం ఆనందంలో ముంచెత్తుతోంది. పవర్ ఫుల్ పీపుల్స్ కమ్స్ ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్.. మీ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రావాలి అంటూ బండ్ల గణేష్‌ను ఓ నెటిజన్ కోరాడు. పక్కా.. మన బాస్ పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో అది కచ్చితంగా జరుగుతుంది అంటూ హామీ ఇచ్చాడు బండ్ల గణేష్. ప్రస్తుతం ఈ ట్వీట్‌ను చూసిన పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.