డ్రగ్స్ కేసు.. పదిహేనేళ్లుగా అంటూ నమ్రతపై బండ్ల గణేష్ కామెంట్స్

బాలీవుడ్‌లో మొదలైన డ్రగ్స్ కేసు.. టాలీవుడ్ గోడలు బీటలు వారేలా చేసేట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో దీపికా పదుకొణె, శ్రద్దా కపూర్ వంటి బడా స్టార్ హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి. ఇక రేపో మాపో వారిని విచారించేందుకు ఎన్‌సీబీ అధికారులు సమన్లు కూడా జారీ చేసేట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆ లిస్ట్‌లో మహేష్ బాబు సతీమణి నమ్రత పేరు రావడం కీలకంగా మారింది.

Bandla Ganesh ABout Allegation On Namrata Shirodkar In Drugs Case
Bandla Ganesh ABout Allegation On Namrata Shirodkar In Drugs Case

రీసెంట్‌గా వాట్సాప్‌ చాట్ లీకవ్వడం అందులో డీ అంటే దీపికా అని ఎస్ అంటే శ్రద్దా కపూర్ అని డీ కోడ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎన్ అంటే నమ్రత శిరోద్కర్ అని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఇక నమ్రతపై ఇలా ఆరోపణలు వెల్లువెత్తడంతో బండ్ల గణేష్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

Bandla Ganesh ABout Allegation On Namrata Shirodkar In Drugs Case
Bandla Ganesh ABout Allegation On Namrata Shirodkar In Drugs Case

నాకు ఆమె గురించి 15 ఏళ్లుగా తెలుసు. ఆమె చాలా మంది మహిళలకు ఒక స్ఫూర్తిని ఇచ్చారు. నమ్రత గారు ఒక గొప్ప భార్య, అలాగే మంచి తల్లి. ఆమె అంటే నాకు చాలా గౌరవం అని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నమ్రత ఇలాంటి ఆరోపణలపై స్పందించకపోవడంతో నెటిజన్లు ఆమె పోస్ట్‌లకు కామెంట్లు చేస్తూ డ్రగ్స్ విషయంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి నమ్రత స్పందిస్తుందో లేదో చూడాలి.