లేటెస్ట్ టాక్ : మరో బ్లాక్ బస్టర్ దర్శకుడుతో బాలయ్య ప్రాజెక్ట్.?

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన అవైటెడ్ సినిమా “అఖండ” నుంచి అద్భుతమైన టీజర్ వచ్చి భారీ రెస్పాన్స్ ని అందుకొని దూసుకెళ్తుంది. ఇది బోయపాటి శ్రీను తో ప్లాన్ చేసిన హ్యాట్రిక్ సినిమా అలాగే ఇది కూడా ఎలాగో బ్లాక్ బస్తర్ ని అందరికీ అర్ధం కూడా అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య ఒక్కో సినిమా ఎంపిక కూడా చాలా బాగుంది.

హిట్ అండ్ మంచి ఫామ్ లో ఉన్న దర్శకుల్ని బాలయ్య ఎంచుకుంటున్నారు. దర్శకుడు గోపిచంద్ మలినేని వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ దర్శకుడు అనీల్ రావిపూడి లతో బాలయ్య సినిమాలు ఓకే చేసేసారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ ఒకటి వైరల్ అవుతుంది. బాలయ్య మరో బ్లాక్ బస్తర్ దర్శకుడు కొరటాల శివ తో ఓ ప్రాజెక్ట్ కి సై అన్నారట. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. మరి దీనిలో ఎంతవరకు నిజముందో చూడాలి.