టీజర్ టాక్ : “భగవంత్ కేసరి” గా దుమ్ము లేపేసిన బాలయ్య.!

నందమూరి కుటుంబ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ బిగ్ డేట్ అయితే ఈరోజు వచ్చేసింది. ఈరోజు జూన్ 10 బాలయ్య బర్త్ డే కావున అభిమానులు “నరసింహ నాయిడు” రీ రిలీజ్ తో డయ్యు స్టార్ట్ చేయగా ఇక ఇప్పుడు అయితే బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ సినిమానే “భగవంత్ కేసరి”.

దర్శకుడు అనీల్ రావిపూడితో అయితే బాలయ్య మొదటి సారి చేస్తున్న సినిమా ఇది కావడంతో భారీ హైప్ ఉంది. ఇక దీని నుంచి అనౌన్స్ చేసిన టైటిల్ తో మంచి రెస్పాన్స్ అందుకున్నాక ఇపుడు అయితే బాలయ్య బర్త్ డే కానుకగా మేకర్స్ ఈరోజు టీజర్ ని అయితే రిలీజ్ చేశారు.

మరి ఈ టీజర్ మాత్రం దుమ్ము లేపేసేలా ఉందని చెప్పాలి. కొద్దిగా వింటేజ్ బాలయ్య షేడ్స్ తో హిందీ డైలాగ్స్ ఠీ అనీల్ రావిపూడి టేకింగ్ అదిరింది అని చెప్పొచు. అలాగే బాలయ్య పై స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా అదరగా థమన్ అయితే బాలయ్య కి ది బెస్ట్ వర్క్ ఇవ్వడంలో మరోసారి ఫెయిల్ అవ్వలేదు.

అఖండ మొన్న వీరసింహా రెడ్డి కి నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిన బి జి ఎం టీజర్ కే హైలైట్ అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే అనీల్ మాత్రం కామెడీ ట్రాక్ ని పక్కన పెట్టి సాలిడ్ మాస్ ట్రీట్ ని కూడా హ్యాండిల్ చేయగలడు అని దీనితో ప్రూవ్ చేసాడని చెప్పాలి.

కాగా ఇందులో కాస్త డిజప్పాయింట్ అంశం ఏదన్నా ఉంది అంటే అది బాలయ్య లుక్ కొంచెం ఆడ్ గా ఉంది. హెయిర్ స్టైల్ మార్చాల్సింది అదొక్కటే తన లుక్ లో మైనస్ అని చెప్పాలి. మిగతా టీజర్ అంతా కూడా బాలయ్య ఫ్యాన్స్ కి గట్టి ట్రీట్ ఇచ్చే స్టఫ్ అని చెప్పొచ్చు.
Bhagavanth Kesari Teaser | Nandamuri Balakrishna | Anil Ravipudi | Kajal | Sree Leela | Thaman S