బాలయ్య, పవన్.. వారం గ్యాప్ లో బిగ్ ఫైట్

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే పండుగలు, పబ్బాలతో పాటు శుక్రవారం రోజు నాడు సినిమాలు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి, దసరా పండుగల అప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఏడాది దసరాకు ఓ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రాబోతున్నాయి. అయితే వారం రోజుల గ్యాప్ లో ఈ సినిమాలు విడుదల అవుతాయని తెలుస్తోంది. అయితే ఆ సినిమాలు ఏవి, ఆ హీరోలు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, నటసింహం నందమూరి బాలకృష్ణ ఎన్బీకే 108 చిత్రాలు వారం రోజుల గ్యాప్ లో వచ్చే దసరా పండుగకు విడుదల కాబోతున్నాయని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2021 ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ జరగగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే చాలా రోజుల నుంచి ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది.

అయితే ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. నర్గిస్ ఫక్రి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్న సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే బాలకృష్ణ, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబోలో వస్తున్న చిత్రం ఎన్బీకే 108. ఈ చిత్రానికి అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతోంది. ఇందులో బాలయ్య బాబు డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. తండ్రి, కుమారుడి రోల్స్ లో కనిపించి మెప్పించేందుకు బాలకృష్ణ సిద్ధం కాగా.. తారకరత్న మృతితో సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే బాలకృష్ణ 108వ చిత్రం కావడంతో.. దీనికి ఎన్బీకే 108 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా వచ్చే దసరాకు విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.