“వీరసింహా రెడ్డి” ఐటెం సాంగ్ లో మైండ్ బ్లాక్ చేసిన బాలయ్య.!

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రానున్న లేటెస్ట్ చిత్రాల్లో “వీరసింహా రెడ్డి” కూడా ఒకటి. బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాపై ఆల్రెడీ మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడడానికి కారణం సినిమా పాటలు కూడా అని చెప్పాలి.

మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఇచ్చిన ఈ సినిమా పాటలు ఆల్రెడీ రెండు సూపర్ హిట్ అయ్యాయి. ఇక మూడో సాంగ్ గా ఓ మాస్ ఐటెం సాంగ్ ని మేకర్స్ అనౌన్స్ చేయగా ఇప్పుడు ఈ ఫుల్ లిరికల్ సాంగ్ అయితే బయటకి వచ్చేసింది. మా బావ మనోభావాలు అంటూ రిలీజ్ చేసిన ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి.

అలాగే బాలయ్య ఈ సాంగ్ లో బాలయ్య చేసిన డాన్స్ లు  ఖచ్చితంగా ఎవరికైనా కూడా మతి పోగొట్టేస్తుంది. శేఖర్ మాస్టర్ ఇచ్చిన స్టెప్పులు కేజ్రీగా చేయగా వాటిలో ఓ సోడా బండిపై వెనక్కి బెండ్ అయ్యి మరీ చేసిన స్టెప్ ఈ ఏజ్ లో మరే ఇతర హీరో కూడా చెయ్యలేరు అని చెప్పడంలో సందేహం లేదు.

ఇక ఈ సాంగ్ లో ఇండో ఆస్ట్రేలియా బ్యూటీ హనీ రోజ్ తన హాట్ అందాలతో  బ్యూటీ హానీ రోజ్ కూడా ఇందులో బాలయ్య సరసన కనిపించింది. ఇంకా లాస్ట్ లో ఇద్దరితో కూడా బాలయ్య చేసిన స్టెప్పులు మరో లెవెల్ కి ఈ సాంగ్ వెళ్ళింది అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఈ సాంగ్ ఈ సినిమా నుంచి మరో హిట్ అని చెప్పాలి.