Balakrishna : కథ వినకుండా సినిమా కు కమిట్ అయిన బాలయ్య.. ఇంతకీ దర్శకుడెవరో తెలుసా?

Balakrishna : బాలకృష్ణ ఎవరినైనా ఇష్టపడ్డాడంటే గుడ్డిగా వాళ్ళను ఫాలో అవుతారు. అగ్ర దర్శకుల నుండి చిన్న దర్శకుల వరకు ఆయన గురించి చెప్పే ఒకే మాట డైరెక్టర్ ఏం చెప్తే అది అలానే చేసే హీరో బాలయ్య బాబు. ఇది ఏమిటి ఎలా అనే ప్రశ్నలు ఉండవు బాలయ్య దగ్గర. అందుకే దర్శకులు మెచ్చే హీరో ఎపుడు బాలయ్యే.ఇటీవలే అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య బోయపాటితో హ్యాట్రిక్ కొట్టాడు.

బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళందరూ షాక్ అయ్యేలా సూపర్ హాట్ కొట్టాడు బాలయ్య. ఇక అటు సినిమాలతో పాటు ఓటిటి లో ను తన జోరు చూపించాడు బాలకృష్ణ. అన్ స్టాపబుల్ కార్యక్రమం తో రికార్డులు బద్ధలు కొట్టాడు.తాజాగా వరుస సినిమాలతో జోరు పెంచాడు. క్రాక్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని తో సినిమా తీయనున్నాడు. దీన్ని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా కు ఓకే చెప్పారట

అయితే అనిల్ రావిపూడితో సినిమాకు కథ వినకుండానే ఓకే చెప్పేశారట.ఈ విషయాన్నీ అనిల్ రావిపూడినే స్వయంగా ప్రకటించారు. F2 సినిమా డైరెక్టర్ అనిల్ f3 షూటింగ్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది సమాచారం.అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తాను నటిస్తున్నానని గతేడాది జూన్ 10వ తేదీన పుట్టినరోజు సందర్భంగా బాలయ్య క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని బాలయ్యకు కథ చెప్పలేదని అనిల్ రావిపూడి వెల్లడించారు. ఈ సినిమా కోసం మూడేళ్లుగా ప్లాన్ చేస్తున్నామని అనిల్ రావిపూడి అన్నారు.

తాను పాన్ ఇండియా సినిమాలు చేయనని పక్కా పైసా వసూల్ సినిమాలు చేస్తానని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఒక సినిమా కోసం ఎక్కువ సమయం గడపడం తనకు నచ్చదని అనిల్ రావిపూడి తెలిపారు.కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల అనిల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్3 మూవీ ఆలస్యంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలను ఆరు నెలల్లోనే పూర్తి చేస్తానని అనిల్ రావిపూడి వెల్లడించారు. కథ వినకుండానే బాలయ్య ఓకే చెప్పాడని తెలిసి బాలయ్యకు అనిల్ రావిపూడిపై ఇంత నమ్మకమా? అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.