NBK108 : మాస్ బాలయ్య..ఫస్ట్ లుక్స్ తో అరాచకం.!

మాస్ గాడ్ నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లాస్ట్ రెండు సినిమాలు అఖండ అలాగే వీరసింహా రెడ్డి చిత్రాలు తన కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కావడమే కాకుండా ఒకదాన్ని మించి ఒకటి భారీ వసూళ్లు రాబట్టి హిట్ అయ్యాయి. దీనితో ఒక నెక్స్ట్ తన కెరీర్ లో చేస్తున్న 108వ సినిమా కోసం నందమూరి అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఉండగా..

దీనిని దర్శకుడు అనీల్ రావిపూడి అయితే తన జానర్ కి డిఫరెంట్ గా ఓ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. మరి రీసెంట్ గానే యంగ్ హీరోయిన్ శ్రీ లీల అలాగే కాజల్ అగర్వాల్ లు సినిమా సెట్స్ లో అఫీషియల్ గా అడుగు పెట్టగా ఈరోజు అయితే చిత్ర యూనిట్ మాసివ్ అనౌన్సమెంట్ లు ఇచ్చారు.

మొదటి నుంచి ఉన్న టాక్ తో బాలయ్య రెండు షేడ్స్ లో నటిస్తున్నట్టుగా చూపిస్తూ రెండు పవర్ ఫుల్ లుక్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. మరి ఒకటి ఫ్లాష్ బ్యాక్ లోని బాలయ్య లుక్ కాగా మరొకటి అయితే జైలు నుంచి రిలీజ్ అయ్యాక వచ్చే బాలయ్య లుక్ గా రిలీజ్ చేశారు.

వీటిలో నెవర్ బిఫోర్ లుక్ లో ఉన్న బాలయ్య ని చూసి అయితే ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కాగా ఈ ఫస్ట్ లుక్స్ ఇప్పుడు అరాచకంగా మారగా దీనితో మరోసారి బాలయ్య గట్టి హిట్ కొట్టేలా ఉన్నాడని అంటున్నారు. కాగా ఈ సినిమాకి సంగీతం ఎస్ ఎస్ థమన్ అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది లోనే రిలీజ్ కానుంది.