వారం వారం రావడానికి నేను సీరియల్ ని కాదు అంటూ రెచ్చిపోయిన బాలయ్య.. ప్రో వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా తన హవా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆహా వేదికగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ అనే షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం దీపావళి కానుకగా ప్రారంభమై రెండు ఎపిసోడ్లను మాత్రమే పూర్తి చేసుకుంది.

మొదటి ఎపిసోడ్ కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాగ రెండవ ఎపిసోడ్ నాచురల్ స్టార్ నాని వచ్చి ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచారు. ఇలా ఈ కార్యక్రమం పై ఎన్నో అంచనాలు పెరిగాయి. కానీ ఈ కార్యక్రమం కేవలం రెండు ఎపిసోడ్ లను మాత్రమే పూర్తి చేసుకుంది. అందుకు గల కారణం బాలకృష్ణ చేతికి చిన్న గాయం కావడం వల్ల సర్జరీ చేశారు ఈ సర్జరీ కారణంగా అతనికి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఈ కార్యక్రమం కొన్ని వారాల పాటు వాయిదా పడింది.

ప్రస్తుతం బాలకృష్ణ పరిస్థితి మెరుగుపడటంతో ఆయన తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో బాలకృష్ణ చేతికి కట్టుతోనే వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా వేదిక పై బాలకృష్ణని చూడగానే అభిమానులు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఆలస్యం అయ్యేసరికి ఎన్నో ఫోన్లు మెసేజ్లు వచ్చాయని అయితే తన ఆరోగ్యం గురించి మాత్రం కాదని ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటూ మెసేజ్ చేశారని తెలిపారు. ఇక ఈ సందర్భంగా వారం వారం రావడానికి నేను సీరియల్ ని కాదు… సెలబ్రేషన్ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి.