శ్రీలీలను ఏడిపించిన బాలకృష్ణ

టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోన్న అందాల భామ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి మూవీతో డిజాస్టర్ ని ఖాతాలో వేసుకుంది. అయితేనేం సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఆశీర్వాదం మాత్రం ఈ బ్యూటీకి లభించింది. దీంతో వెంటవెంటనే అవకాశాలు శ్రీలీల సొంతం చేసుకుంది.

రెండో సినిమాని ఏకంగా మాస్ మహారాజ్ రవితేజతో ధమాకా చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఏకంగా వంద కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసుకుంది. దీంతో శ్రీలీల ఇమేజ్ కాస్తా పెరిగిపోయింది. ఇక వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఏకంగా ఎనిమిది సినిమాల వరకు ఉన్నాయి.

అందులో రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో వస్తోన్న పాన్ ఇండియా మూవీ కూడా ఉండటం విశేషం. కుర్ర హీరోలు అందరూ కూడా శ్రీలీలతో రొమాన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరో వైపు ఈ అమ్మడు అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో ఎన్బీకె 108లో ఈ అమ్మడు నటిస్తోంది. అయితే ఆమె బాలకృష్ణ కూతురిగా నటిస్తోందని ఓ వైపు ప్రచారం జరుగుతోంది.

మరో వైపు శ్రీలీలకి బాడీ గార్డ్ గా బాలకృష్ణ పాత్ర ఉంటుందనే మాట వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ సందర్భంగా బాలకృష్ణ శ్రీలీలని లాగి పెట్టి కొట్టారంట. ఇప్పుడు ఇదే ఫిల్మ్ నగర్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే బాలకృష్ణ శ్రీలీలని కొట్టింది సినిమాలో భాగంగా అని తెలుస్తోంది.

మూవీలో సీన్ వీలైనంత నేచురల్ గా రావడం కోసం తనని నిజంగానే కొట్టమని శ్రీలీల అడిగిందంట. అయితే దీంతో బాలకృష్ణ కూడా సీన్ పెర్ఫెక్షన్ కోసం నిజంగానే ఆమె మీద చేయి చేసుకున్నారంట. ఇక బాలకృష్ణ కొట్టిన దెబ్బకి శ్రీలీలకి బుగ్గలు వాచిపోయాయనే మాట వినిపిస్తోంది. అయితే ఇలా కొట్టడం వలన సీన్ మాత్రం అద్భుతంగా వచ్చిందంట.