బాలకృష్ణ ఇన్నాళ్ళకి కరక్ట్ డైరెక్టర్ కి సంతకం పెట్టాడు !

బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. బీబీ 3 అన్న వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుండగా మోనార్క్ అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. బోయపాటి శ్రీను గతంలో బాలయ్య కి సింహా, లెజెండ్ సినిమాలతో భారీ హిట్స్ ని ఇచ్చిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. కాగా బాలయ్య – బోయపాటి శ్రీను ల క్రేజీ కాంబినేషన్ లో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత బీబీ 3 తెరకెక్కుతోంది. ఇప్పటికే బీబీ 3 ఫస్ట్ రోర్ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు దర్శకుడు బోయపాటి శ్రీను.

బాలయ్య – బోయపాటి మళ్ళీ ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నారని బీబీ3 ఫస్ట్ రోర్ లో ఉన్న ఒక్క డైలాగ్ తో అందరూ ఫిక్స్ అయ్యారు. ఇక రీసెంట్ గా బీబీ 3 రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. అంతేకాదు త్వరలో టీజర్ ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కాగా మే 28 న బాలకృష్ణ – బోయపాటి శ్రీను ల బీబీ3 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉండగా.. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ మధ్యనే బాలయ్య – ప్రగ్యా జైస్వాల్ మీద ఒక మాస్ సాంగ్ ని కూడా షూట్ చేశారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడన్నది సస్పెన్స్ గా మారింది. అందరూ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాలయ్య నెక్స్ట్ సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే బాలయ్య నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేని తో చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్. రీసెంట్ గా గోపీచంద్ మలినేని రవితేజ తో క్రాక్ సినిమా తీసి భారీ హిట్ అందుకున్నాడు. దీంతో గోపీచంద్ మలినేని కి మేకర్స్ నుంచి వరసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో బాలయ్య తో సినిమా చేసేందుకు గోపీచంద్ మలినేని కి అవకాశం వచ్చిందని సమాచారం. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారని తెలుస్తోంది.