బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే హ్యాట్రిక్ సినిమాలు కనిపిస్తాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య సినిమా అంటే నందమూరి ఫ్యాన్స్ అంచనాలు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి.
బాలయ్యని సిల్వర్ స్క్రీన్ పై ఒక సింహం తరహాలో, సూపర్ మెన్ తరహాలో బోయపాటి ఆవిష్కరిస్తూ ఉంటాడు. బోయపాటి సినిమాలలో బాలకృష్ణకి పవర్ ఫుల్ ఎలివేషన్స్ కి నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులందరు కూడా విజిల్స్ వేసేలా చేస్తాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ముందుగానే అది బ్లాక్ బస్టర్ హిట్ అని ఫిక్స్ అయిపోతారు.
ఇదిలా ఉంటే మరోసారి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి చాలా రోజుల నుంచి అటు పొలిటికల్ సర్కిల్ లో ఇటు సినిమా వర్గాలలో చర్చ నడుస్తుంది. ఈసారి రాజకీయాలను ఎలిమెంట్ గా చేసుకుని బోయపాటి బాలకృష్ణతో సినిమా చేస్తాడనే ప్రచారం నడుస్తుంది.
ఇక ఈ సినిమా జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అఫీషియల్ గా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సినిమా వర్గాల్లో చర్చ నడుస్తుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను, రామ్ పోతినేని తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసినట్లుగా తెలుస్తుంది.
మరోవైపు బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథాంశంతో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు కూడా జూన్ నాటికి కంప్లీట్ అయిపోతాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బోయపాటి బాలకృష్ణతో సినిమాని జూన్ 10న లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్ సర్కిల్ లో చెప్పుకుంటున్నారు.