గోపీచంద్‌తో బాలయ్య.. వాటే కాంబో!

నందమూరి బాలకృష్ణ హిట్టు కొట్టి చాలా కాలమవుతోంది. కరోనా ఎఫెక్ట్ లేకపోయి ఉంటే ఈ పాటికే బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా హడావుడి మొదలయ్యేది. సంక్రాంతికి వస్తుందని అనుకున్న ఆ సినిమా ఇప్పుడు మళ్లీ సమ్మర్ కు షిఫ్ట్ కానుంది. ఎన్టీఆర్ బయోపిక్స్ ద్వారా ఊహించని డిజాస్టర్స్ అందుకున్న బాలయ్య బోయపాటి సినిమాతో మళ్ళీ ఎలాగైనా ట్రాక్ లోకి రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

213610 Balakrishna Latest Movie | Telugu Rajyam
ఇక బోయపాటితో ఇదివరకే సింహా, లెజెండ్ వంటి సినిమాలు చేసి భారీ హిట్స్ అందుకున్న బాలయ్య మరోసారి హిట్ కొట్టడమైతే కాయమని అనిపిస్తోంది. అయితే ఆ తరువాత బాలయ్య ఎలాంటి దర్శకుడితో సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. లిస్ట్ లో కొందరు దర్శకులు ఉన్నప్పటికీ ఇంకా ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు గోపిచంద్ మలినేని పేరు కూడా వినిపిస్తోంది.

గోపిచంద్ మలినేని రవితేజతో క్రాక్ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. చూస్తుంటే హిట్టు కొట్టేలా ఉన్నారని అనిపిస్తోంది. రవితేజతో గోపీకి ఇది మూడవ సినిమా. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన డాన్ శీను, బలుపు కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు బాలయ్య ఈ దర్శకుడిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు టాక్.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles