Balakrishna : అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత వరుస సినిమాలతో బాలయ్య…!

Balakrishna : కరోనా తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా ఘనవిజయం సాధించింది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో ఇదివరకు సింహా లెజెండ్ సినిమా రాగా మూడవ చిత్రం గా వచ్చిన అఖండ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అఖండ సినిమా తోనే కాకుండా ఆహా ఓ టీ టీ లో ప్రసారమైన అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా బాలకృష్ణ ఇమేజ్ ఇంకోమెట్టు ఎదిగింది అని చెప్పుకోవచ్చు.

ఈ రెండు సక్సెస్ ల జోష్ లో బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో మరో సినిమా చేస్తున్నట్టు అప్పుడే ప్రకటించేశారు కూడా. అయితే ఈ రెండు సినిమాలే కాకుండా బాలకృష్ణ మరి కొన్ని సినిమాలను కూడా లైన్లో పెట్టినట్లు సమాచారం. గోపిచంద్ మలినేని అనిల్ రావిపూడి సినిమాలే కాకుండా బాలకృష్ణ మరోసారి బోయపాటి శ్రీను తో జతకట్టనున్నట్టు సమాచారం. పూరి జగన్నాథ్ కూడా బాలకృష్ణ కోసం ఒక కథ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలే కాకుండా కొరటాల శివ,పరశురాం, వెంకీ అట్లూరి లాంటి దర్శకులు కూడా బాలకృష్ణ తదుపరి చిత్రాల జాబితాలో ఉన్నట్లు భోగట్టా.
కాకపోతే బాలకృష్ణ రెమ్యూనరేషన్ ఒక సినిమాకి 10 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. మిగతా హీరోలతో పోలిస్తే తక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ కావడం తో నిర్మాతలు కూడా బాలకృష్ణతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాలే కాకుండా అన్ స్టాపబుల్ సీజన్2 ప్రసారం కావాల్సి ఉండగా ఇందుకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్2 కోసం భారీ మొత్తం డిమాండ్ చెస్తున్నారని తెలుస్తోంది.  ఇలా వరుసగా సినిమాలు ప్రోగ్రాంలు చేసుకుంటూ బాలకృష్ణ తన కెరీర్ ని ప్లాన్ చేస్కుంటున్నాడు.