Balakrishna: బాలకృష్ణ ఈ ఏడాది అఖండ సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డులు కొల్లగొట్టారు. సనాతన ధర్మాన్ని కాపాడే అఖండ గా ఊరికోసం పోరాడే మురళి కృష్ణగా రెండు పాత్రలతో అలరించారు. బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ నాలుగో సినిమా కుడా భారీ హిట్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఆహా ఒరిజినల్స్ ద్వారా అన్ స్టాపబుల్ షో చేసి వండర్స్ క్రియేట్ చేసారు.
ఇక ఇపుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107 సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన బాలకృష్ణ లుక్ ను విడుదల చేసారు. ఇక పవర్ ఫుల్ గా ఉన్నా బాలయ్య లుక్ సినిమాపై అంచనాలు పెంచారు ఇక ఈ సినిమా ద్వారా మొదటి సారిగా కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా పరిచయమవుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి ఎటువంటి సర్జరీ జరగలేదు, ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కొరకు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది.
ఈ రోజు ఆయన సారధి స్టూడియోస్ లో #NBK107 షూటింగ్ లో పాల్గొన్నారు.
దయ చేసి అవాస్తవాలను ప్రచురించవద్దు, వ్యాప్తి చేయవద్దు.#NandamuriBalakrishna pic.twitter.com/2JjkiVms0P
— Vamsi Kaka (@vamsikaka) April 26, 2022
ప్రస్తుతం సిరిసిల్ల లో షూటింగ్ పూర్తి చేసుకుని సారథి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే లేటెస్ట్ గా బాలకృష్ణ మోకాలి నొప్పితో చాలా కాలంగా బాధపడుతున్నారని ఇక ఈ నొప్పి తీవ్రమవడంతో ప్రస్తుతం మోకాలి సర్జరీ చేయించుకున్నారనే వార్తలు వచ్చాయి. వీటికి సాక్ష్యంగా హాస్పిటల్ లో డాక్టర్లతో బాలకృష్ణ తీసుకున్న ఫోటోను చూపిస్తున్నారు. కానీ అంటువంటిది ఏమి లేదని బాలకృష్ణ గారూ కేవలం రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళినపుడు ఈ ఫోటోను తీసుకున్నారని ఆయన ప్రస్తుతం సారథి స్టూడియోలో షూటింగ్ లో ఉన్నారని క్లారిటీ ఇచ్చారు చిత్ర బృందం. ఇక బాలయ్య అభిమానులు ఆందోళన చెందోద్దని చెప్పారు.