బాలయ్య కూడా అదే కావాలంటున్నాడు.!

‘వాల్తేరు వీరయ్య’ సినిమా అంత పెద్ద విజయం ఎలా సాధించిందబ్బా.? అని నందమూరి బాలకృష్ణ ఒకటే ఇదయిపోతున్నారట. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’తోపాటే ‘వాల్తేరు వీరయ్య’ కూడా విడుదలైంది.

అయితే, ‘వీరసింహారెడ్డి’ సీరియస్ మూవీ అయిపోతే, ‘వాల్తేరు వీరయ్య’ కమర్షియల్ హిట్టయ్యింది. అదీ సంగతి. ‘వాల్తేరు వీరయ్య’ దెబ్బకి, ‘వీరసింహారెడ్డి’ నిరసించిపోవడం తెలిసిన విషయమే.

అందుకేనేమో, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సబ్జెక్ట్ కావాలంటూ బాలకృష్ణ వెతుకులాట మొదలు పెట్టాడట. ‘ఆ పనేదో నువ్వే చేసెయ్యొచ్చు కదా.?’ అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి చెవిన ఓ మాట వేశాడట బాలయ్య.

అంత కేపబిలిటీ వున్నోడే అనిల్ రావిపూడి. సో, ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న సినిమా పూర్తయ్యాక.. బాలయ్యతోనే, మాంఛి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ అనిల్ రావిపూడి చేసినా చేయొచ్చు.