Balakrishna : సామాజిక అంశంతో సినిమా హీట్ పెంచిన బాలయ్య… వరుస సినిమాలతో జోరుమీదున్న నటసింహం..!

Balakrishna :అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య బోయపాటితో హ్యాట్రిక్ కొట్టాడు. బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళందరూ షాక్ అయ్యేలా సూపర్ హాట్ కొట్టాడు బాలయ్య. ఇక అటు సినిమాలతో పాటు ఓటిటి లో ను తన జోరు చూపించాడు బాలకృష్ణ. అన్ స్టాపబుల్ కార్యక్రమం తో రికార్డులు బద్ధలు కొట్టాడు. తాజాగా వరుస సినిమాలతో జోరు పెంచాడు. క్రాక్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని తో సినిమా తీయనున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా కు ఓకే చేసారు బాలకృష్ణ.

ఇక బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న చిత్రం గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది.సినిమా కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందని.. కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించ బోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య బాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగానే తీయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నాడు. తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది. బాలయ్యతో సినిమా అంటే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.

ఇక అనిల్ రావిపూడితో సినిమా తర్వాత.. బాలయ్య, పూరి జగన్నాథ్ కి డేట్లు ఇచ్చాడు. పూరితో చేయబోయే సినిమా వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందని.. బాలయ్య ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఈ సినిమా వచ్చే ఏడాది చివరి నుంచి మొదలు కానుంది. ఇక మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవబోతోంది. అదే శ్రీకాంత్ అడ్డాలతో బాలయ్య బాబు సినిమా ఓకే అయినట్టే అనీ ఫిల్మ్ వర్గాల టాక్. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నట్టు సమాచారం.