Balakrishna: దసరాకు కనువిందు చేయనున్న బాలకృష్ణ గోపీచంద్ సినిమా..!

Balakrishna: బాలయ్య బాబు అఖండ సినిమా థియేటర్స్ తోపాటు సినిమా అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చారు.ఇక OTT లో అడుగు పెట్టి చరిత్ర తిరగరాశారు. ఆహా ఒరిజినల్స్ లో వచ్చిన అన్ స్టాపబుల్ తో trp లెక్క మార్చేశారు. సీజన్ 1 ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి రెండో సీజన్ కోసం సిద్ధంవుతున్నారు .ఇక NBK @107ను మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయబోతున్నారు అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. క్రాక్ సినిమా హిట్ తర్వాత గోపీచంద్ మలినేని తీయబోతున్న ఫిల్మ్ కావడం తో అంచనాలు పెరిగాయి.ఇక ఈ సినిమా నుండి బాలయ్య బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాక రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక ఇపుడు ఇంకో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటికి వచ్చింది.

మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది.ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది.కాగా ఈ సినిమాలో కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే కన్నడ హీరో దునియా విజయ్ బాలయ్యను ఢీ కొట్టే పవర్ ఫుల్ విలన్ ముసళ్ల మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కనిపిస్తున్నాడు.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ భయంకరంగా ఉండడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇకపోతే ఈ సినిమాను కంటిన్యూగా షూటింగ్ ఫినిష్ చేసి వచ్చే దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే దసరాకే బాలయ్య సినిమా అంటే అఖండ వచ్చిన యేడాదిలోపే మరో సినిమాతో ఆయన అభిమానులకు మాంచి విందు ఇవ్వనున్నాడన్న మాట. ఇక బాలయ్య స్టైల్లో ఫుల్ మాస్ జాతర కావడంతో మరోసారి థియేటర్లు మాస్ మానియాతో ఊగిపోనున్నాయి.ఈ సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి – బాలయ్య కాంబినేషన్లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను జూన్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.