లేటెస్ట్ : తన షోలో పవన్ పై అదిరే సెటైర్ వేసిన బాలకృష్ణ.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మాస్ గాడ్ నందమూరు బాలకృష్ణ లు ఎప్పుడో ఒకటి రెండు సందర్భాల్లో జస్ట్ అలా కలిసిన ఫోటోలు చూసి ఉంటాము కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇద్దరు కూడా ఒకే స్టేజి పై ఓ గంట పాటు మాట్లాడుకొని ఎంటర్టైన్మెంట్ అందివ్వడం అనేది రీసెంట్ గానే జరిగింది.

మరి తెలుగులో అత్యంత పాపులర్ అయినా స్ట్రీమింగ్ యాప్ ఆహా లో అందులోని ఇండియా లోనే పెద్ద హిట్ అయినటువంటి బాలయ్య టాక్ షో అన్ స్టాప్పబుల్ 2 సరికొత్త ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రావడం జరిగింది. ఇక ఈరోజు అయితే షో యాజమాన్యం సంక్రాంతి గిఫ్ట్ గా బాలయ్య పవన్ అభిమానులకి ఆ మాస్ అండ్ పవర్ గ్లింప్స్ ని ఇచ్చేసారు.

చాలా పవర్ ఫుల్ విజువల్స్ అండ్ పవన్ కళ్యాణ్ మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కట్ చేసిన ఈ లేటెస్ట్ వీడియో అదిరే లెవెల్లో అనిపిస్తుంది. ఇక లాస్ట్ లో అయితే స్టేజి పై బాలయ్య పవన్ ని ఉద్దేసించి పవన్ కొలతలు కొలవాలి అంటూ పేల్చిన సెటైర్ దెబ్బకి పవన్ ఒక్కసారిగా నవ్వేయడం ఈ వీడియోలో హైలైట్ గా నిలిచింది.

దీనితో మాత్రం ఈ ఫుల్ ఎపిసోడ్ వేరే లెవల్లో ఉంటుందని అర్ధం అవుతుంది. ఇక ఈ ఎపిసోడ్ ని ఆహా వారు ఈ జనవరి చివరలో లేదా ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ కి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఈ వీడియో చూసి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.