పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ కోసం బాలకృష్ణ.?

నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళ క్రితం ఒకే వేదికపై కనిపించి సందడి చేశారు. అదే, ‘ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో’.! అప్పట్లో, అదో పెద్ద సంచలనం. రెండు ఎపిసోడ్స్‌గా ప్రసారమైంది పవన్ కళ్యాణ్‌తో బాలయ్య టాక్ షో.

బాలయ్యతో తనకు చక్కటి అనుబంధం వుందని పవన్ కళ్యాణ్ ఆ టాక్ షోలో చెప్పారు. అది మొహమాటానికా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

ఇదిలా వుంటే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసం నందమూరి బాలకృష్ణ పేరు ప్రచారంలోకి వచ్చింది. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

అసలు బాలయ్య పేరు ఈ సినిమాకి సంబంధించి ఎందుకు ప్రచారంలోకి వచ్చినట్లు.? హరీష్ శంకర్ ఏమైనా చిన్న ప్రయోగం చేయబోతున్నాడా.? నిప్పు లేకుండా పొగ అయితే రాకపోవచ్చు. ఏమో, వచ్చినా రావొచ్చు. ఏది నిజం.? వేచి చూడాల్సిందే.