నందమూరి తారకరామారావు నటించిన సినిమా ‘నర్తనశాల’. సాంఘిక జానపద పౌరాణిక చారిత్రాత్మక పాత్రలలో మెప్పిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సినిమాని తన స్వీయదర్శకత్వంలో ఈ 2004లో చిత్రీకరణ ప్రారంభం అయింది. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబు లతో భారీ ఎత్తున తెరకెక్కించాలని బాలయ్య కల కన్నారు. ఎన్నో సందర్భాలలో ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు.
‘నర్తనశాల’ సినిమాతో మొదటిసారు దర్శకత్వం వహిస్తూ భారీ తారాగణంతో రూపొందించనున్నారని ప్రచారం మొదలవగానే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కాని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న తర్వాత హీరోయిన్ సౌందర్య ప్రమాదవశాత్తు మరణించడంతో బాలకృష్ణ ‘నర్తనశాల’ ని ఆపేశారు. ఆ తర్వాత ఎన్నో సార్లు ఈ సినిమా గురించి రక రకాల వార్తలు ప్రచారంలో నిలిచినప్పటికి బాలయ్య మాత్రం ఈ సినిమా విషయంలో ఏ విషయాన్ని వెల్లడించలేదు.
అయితే దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను దసరా పండగా సందర్భంగా విడుదల చేయాలని తాజాగా నిర్ణయించుకున్నారు. నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ చిత్రం ఎన్బికె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న విడుదల చేయనున్నారు. ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించాలని బాలయ్య నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నర్తనశాల నుంచి బాలయ్య పోస్టర్ ని రిలీజ్ చేశారు.
ఇక ప్రస్తుతం బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసందే. హ్యాట్రిక్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాని ద్వారకా క్రియోషన్స్ లో మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. మలయాళ, తమిళ సినిమాలలో నటించి గుర్తింపు పొందిన ప్రగ్యా మార్టిన్ ని హీరోయిన్ గా ఎన్నుకున్నట్టు సమాచారం.