బాలయ్య గొప్పతనానికి ఫిదా అయిపోయిన నందమూరి ఫ్యాన్స్ !

balakrishna committed new movie with director b.gopal

కరోనా మహమ్మారి ప్రభావం వలన ప్రపంచం అంత ఎక్కడిక్కడ ఆగిపోయిన రోజుల్లో సినిమా ఇండస్ట్రీ కూడా ఏ షూటింగ్స్ లేకుండా ఫిలిం నగర్ మూగబోయింది.లొక్డౌన్ తీసేశాక హీరోలు కొందరుషూటింగ్ స్టార్ట్ చేసి రెండు రోజులు షూట్ చేసి.. కరోనా ఇబ్బందుల వల్ల మధ్యలోనే ఆపేశారు. బాలయ్య మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను ఒప్పుకుంటూ షూటింగ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. తాజాగా బాలయ్య మరో సీనియర్ దర్శకుడితో సినిమాని ఫైనల్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిన బి గోపాల్. అయితే‘బాలయ్య – బి గోపాల్’ల సూపర్ హిట్ కాంబినేషనేలో బాలయ్య మొత్తం కెరీర్లోనే సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ సినిమాలు అభిమానులకి కనువిందు చేశాయి.

balakrishna committed new movie with director b.gopal
balakrishna committed new movie with director b.gopal

కానీ డైరెక్టర్ గా పూర్తిగా ఫేడ్ అవుట్ అయిన గోపాల్ కి ఏ హీరో ఛాన్స్ ఇవ్వడు, బాలయ్య తప్ప. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే పూర్తి చేసుకుందట. ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ ను రాస్తున్నారని సమాచారం. సాయి మాధవ్ డైలాగ్స్ బాగా రాయగలడు గానీ, అతను కథను ఇంతవరకూ రాయలేదు. పైగా కథ విషయంలో సాయి మాధవ్ బాగా వీక్ అనే నేమ్ కూడా ఇండస్ట్రీలో ఉంది. మరి అలాంటి సాయి మాధవ్ కథతో గోపాల్ గారు ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.

ఏంటంటే… ఈ సినిమాలో బాలయ్య ఏజ్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని.. సినిమా కాస్త ఎమోషనల్ గా ఉంటుందని .. గతంలో బాలకృష్ణ ఎప్పుడూ ఇలాంటి కథలో నటించలేదని తెలుస్తోంది. అయితే సినిమా మాత్రం బాలయ్య శైలిలోనే సాగుతూ కాస్త కొత్తగా ఉంటుందట. గోపాల్ కరోనా తగ్గిన వెంటనే షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని.. కాకపోతే బాలయ్య మాత్రం నవంబర్ నుండి షూటింగ్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ దసరా నాడు అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. మొత్తానికి బాలయ్య గ్యాప్ లేకుండా వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.ఇలా మా బాలయ్య ఒక్కడే చేయగలడని నందమూరి అభిమానులు చెబుతున్నారు. కొన్ని విషయాలలో బాలయ్యని మించేవారు లేరన్నది వాస్తవం.