Nandamuri Balakrishna : బాలయ్య తన పుట్టినరోజున అభిమానులకు గిఫ్ట్ ఇవ్వబోతున్నారా…!

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ అఖండ ఘన విజయం తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. కానీ ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇంతవరకు లేదు ఇంకా టైటిల్ కూడా తెలియాల్సి ఉంది.

అయితే జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాలను చిత్రబృందం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. టైటిల్ తో పాటు టీజర్ ని కూడా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా తర్వాత అనిల్ రావిపూడి తో సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా తో పాటు బోయపాటి శీను తో ఇంకొక సినిమా కూడా లైన్లో ఉంది. ఇంకా కొంతమంది యువ దర్శకులు, సీనియర్ దర్శకులతో బాలకృష్ణ సినిమాలు చేయనున్నట్లు సమాచారం.

బాలకృష్ణ గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి సినిమాల తర్వాత చాలా సినిమాల్లో లైన్లో పెట్టినట్టు, ఈ విషయాల గురించి కూడా బాలకృష్ణ తన పుట్టిన రోజును వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తానికి బాలకృష్ణ అభిమానుల కోసం ఈ పుట్టిన రోజున భారీగా గిఫ్ట్ ప్లాన్ చేసినట్లు ఉన్నారు. ఇక నందమూరి అభిమానులకు ఆ రోజు పండగే అని చెప్పుకోవాలి. బాలకృష్ణ ఇతర హీరోలతో పోలిస్తే రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా డిమాండ్ చేయకపోవడంతో నిర్మాతలు కూడా బాలకృష్ణతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.