బోయపాటి, బాలయ్య కాంబో.. ప్రొడ్యూసర్ ఫిక్స్

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటే హ్యాట్రిక్ హిట్స్ కనిపిస్తాయి. సింహ, లెజెండ్, అఖండ సినిమాలు దేనికవే ప్రత్యేకం అని చెప్పాలి. బాలకృష్ణ ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో కరెక్ట్ గా తెలిసిన దర్శకుడిగా బోయపాటి గురించి నందమూరి అభిమానులకి ఉన్న నమ్మకం.

అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే బ్లాక్ బస్టర్ హిట్ అని ఫిక్స్ అయిపోతారు. ఊరమాస్ కథలతో బాలకృష్ణని నెక్స్ట్ లెవల్ లో బోయపాటి ఆవిష్కరిస్తూ ఉంటారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మర వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ఉంటుందని అందరూ అంచన వేశారు. గత కొంతకాలంగా ఈ చిత్రంపై ప్రచారం కూడా నడుస్తోంది.

అయితే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో అఖండ సీక్వెల్ ఉంటుందనే టాక్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆ మధ్య అఖండ సీక్వెల్ ఉంటుందని అధికారికంగా బోయపాటి కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఆ మూవీకి సంబందించిన ప్రొడ్యూసర్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అఖండ పార్ట్ 2 ఉంటుందంట.

ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే బోయాపాటి పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించనున్నారంట. ఇక ఈ ప్రాజెక్ట్ లో ఏపీలో రాజకీపరమైన అంశాలని కూడా టచ్ చేయనున్నట్లు టాక్. రాబోయే ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత కథాంశాన్ని ఫిక్షనల్ లో చెప్పడానికి బోయపాటి రెడీ అవుతున్నారంట.

ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ పోతినేని హీరోగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత బాలయ్యతో అఖండ సీక్వెల్ ని ఎన్.బి.కె 108 ప్రాజెక్ట్ గా రెడీ చేయనున్నారంట. బోయపాటి మూవీ అంటే కథ కూడా వినకుండాఒకే చెప్పేస్తారు. గతంలో బాలయ్య ఈ విషయాన్ని చెప్పారు. బోయపాటి మీద తనకి పూర్తి నమ్మకం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.