ఓ వైపు అనిల్ రావిపూడి, ఇంకో వైపు నందమూరి బాలకృష్ణ.. ఈ ఇద్దరూ ‘భగవంత్ కేసరి’ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తప్పులేదు.. ప్రతిష్టాత్మకంగానే తీసుకోవాలి.! కాకపోతే, తేలిపోయిన సినిమాని.. మళ్ళీ నిలబెట్టాలని చూడటమే అభ్యంతరకరం.
తొలి రోజు వసూళ్ళు పేలవంగా వచ్చాయి ‘భగవంత్ కేసరి’ సినిమాకి. రెండో రోజు మరీ దారుణం. కానీ, మూడో రోజుకి స్క్రీన్లు పెంచారట.! బాలయ్య అభిమానులైతే చందాలు వేసుకుని మరీ టిక్కెట్లు కొంటున్నారు.. వాటిని, ఇతరులకు అంటగడుతున్నారు.
అలా టిక్కెట్లను అంటగడుతున్నా, ఊరికినే వచ్చిన టిక్కెట్లను సైతం, జనం లైట్ తీసుకుంటున్నారట. ఇది మరీ కామెడీ.! బాలయ్యకు సంబంధించి చాలా సినిమాల విషయంలో ఇలాంటి వ్యవహారాలు నడిచాయి. ఈసారి ఇంకాస్త ఎక్కువగా పరువు పోతోందంతే.!
ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా హిట్టేనని నిరూపించెయ్యాలని అటు అనిల్ రావిపూడి, ఇటు నందమూరి బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం కోట్లు అయినా ఖర్చు పెట్టడానికి సిద్ధమేనట.!
డిజాస్టర్ సినిమాలకి కూడా వంద రోజుల పోస్టర్ వేయించుకోవడం బాలయ్యకి అలవాటే.! అనిల్ రావిపూడి సంగతి సరే సరి.!