నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సక్సెస్ లు అందుకొని మంచి జోరు మీద ఉన్నారు. ఈ ఏడాది వీరసింహారెడ్డితో సూపర్ హిట్ మూవీని ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కమర్షియల్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకొని వరుస సక్సెస్ లతో అప్రతిహతంగా అనిల్ రావిపూడి దూసుకుపోతున్నాడు. అనిల్ సినిమాలు అంటే యాక్షన్ తో పాటు కావాల్సినంత వినోదం ఉంటుంది.
అయితే బాలకృష్ణ సినిమాలు అంటే ఫుల్ సీరియస్ యాక్షన్ మోడ్ లో కథ నడుస్తుంది. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుంది అనే ఆసక్తి నందమూరి అభిమానుల్లో ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాలో శ్రీలీల బాలయ్య కూతురిగా కనిపిస్తుంది అనే మాట వినిపిస్తుంది. ఇక హీరోయిన్ ఎవరనేది అధికారికంగా ఖరారు కాలేదు.
నయనతారని సంప్రదిస్తున్నారని టాక్ అయితే ఉంది. అలాగే శ్రియ పేరు కూడా వినిపిస్తుంది. అయితే వారిలో ఎవరిని ఖరారు చేస్తారో తెలియదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ఒక టాక్ వినిపిస్తుంది. ఈ మూవీని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు అనిల్ రావిపూడి సిద్ధం అవుతున్నాడు అని తెలుస్తుంది.
సాహు గారపాటి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా బాలయ్య కూడా కెరియర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ ని ఈ సినిమా తీసుకుంటున్నాడు అనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ అప్డేట్ ని ఈ నెల ఆఖరులో అనిల్ రావిపూడి ఇచ్చే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. అయితే క్యాస్టింగ్ సెలక్షన్, ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాకుండానే రిలీజ్ డేట్ పై జరుగుతున్న ప్రచారంలో ఎంత వరకు వాస్తవం ఉంది అనేది తెలియాల్సి ఉంది.