‘దసరా’ రేసు నుంచి తప్పుకోనున్న బాలయ్య.?

‘ఎన్‌బికె 108’ సినిమా దసరా కానుకగా.. అంటూ ప్రకటన వచ్చేసింది. ‘దసరాకి ‘ఆయుధపూజ’ అని పేర్కొంటూ సినిమా రిలీజ్‌ని కన్‌ఫామ్ చేసింది ఇటీవలే చిత్ర నిర్మాణ సంస్థ ఓ ప్రకటనలో.

కానీ, అప్పటికే దసరా బరిలో రవితేజ, రామ్ వంటి హీరోలు తమ తమ ప్రతిష్టాత్మకమైన చిత్రాలతో సిద్ధంగా వున్నారు. అనూహ్యంగా బాలయ్య దూసుకొచ్చారు. దాంతో, బాలయ్యే తన రిలీజ్ డేట్ మార్చుకునే యోచన చేస్తున్నారనీ తెలుస్తోంది.

అన్ని వైపుల నుంచీ బాలయ్యపై ఒత్తిడి పెరిగిపోతోందిట. అందులోనూ బాలయ్యకీ ఈ సినిమా ప్రతిష్టాత్మకమే కాస్త అటూ ఇటూ అయ్యిందంటే రిజల్ట్ దెబ్బడిపోద్ది.

మరోవైపు బోయపాటితో బాలయ్యకున్న పరిచయం కూడా చెప్పుకోదగ్గదే. సో, బోయపాటి స్వయంగా బాలయ్యని రిక్వెస్ట్ చేశాడట. రామ్‌తో తాను తెరకెక్కిస్తున్న సినిమా కోసం. ఏం జరుగుతుందో చూడాలి. బాలయ్య తగ్గకపోతే, రామ్ వేరే డేట్ చూసుకోక తప్పదు. కానీ, బాలయ్యే తగ్గుతాడని అంటున్నారు.