RRR:ఒకే వేదికపై సందడి చేయనున్న బాలయ్య, చిరు..! ఇక అభిమానులకు పండగే..

RRR:టాలీవుడ్ బాలీవుడ్ తేడాలేకుండా ఇండియా మొత్తం సినిమా అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ చరణ్ మల్టీస్టారర్ గా చేసిన ఆర్ ఆర్ ఆర్. ఇప్పటికే ఈ సినిమా చాలా కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు మార్చి 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకూ సినిమా ప్రమోషన్ లు బాగా జరిగాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి జరగాల్సిన ప్రమోషన్ చాలా ముఖ్యం.

ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ లో భాగంగా జక్కన్న భారీ స్కెచ్ వేసినట్లు ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ మార్చి 25న రిలీజ్ కాబోతున్న సందర్భంలో, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెలలోనే అంగరంగ వైభవంగా జరపాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి హాజరు అవుతున్నట్లు ఇన్ సైడ్ టాక్.

అధికారిక ప్రకటన ఇంకా చేయకపోయినా బాలకృష్ణ చిరంజీవి ఇద్దరూ ఈ వేడుకకు హాజరు అవుతున్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తారక్ కోసం బాలకృష్ణను చరణ్ కోసం మెగాస్టార్ ను జక్కన్న రంగంలోకి దింపుతున్నారు అట. ఇదే కనుక నిజమైతే అభిమానులకు పండగే .ఒకే వేదిక మీద నందమూరి హీరోలు, మెగా హీరోలు సందడి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. దీని గురించి ఇప్పటి నుండి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఇది నిజం అవుతుందో కాదో అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాలి.