ప్రైడ్ మూమెంట్ : “బలగం” కి 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్.!

తెలుగు సినిమా దగ్గర ఇటీవల వచ్చిన ఓ లేటెస్ట్ గా ఐతే తెలుగు నేల విలువలు చాటుతూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమానే “బలగం”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా అయితే నటించిన ఎమోషనల్ చిత్రం ఇది.

మరి దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ మన్ననలు అందుకోవడమే కాకుండా భారీ వసూళ్లు కొల్లగొట్టి భారీ లాభాలు ఈ సినిమా అందుకుంది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా ఖాతాలో మరో ప్రైడ్ మూమెంట్ చేరింది. ఈ సినిమాకి మన దగ్గర కాకుండా ఇంటర్నేషనల్ అవార్డు దక్కడం విశేషంగా మారింది.

యూఎస్ కి చెందిన లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ వారు బలగం సినిమాకి గాను బెస్ట్ ఫీచర్  సినిమాగా దర్శకుడు టిల్లు వేణు కి అలాగే ఆచార్య వేణు లకి గాను బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా రెండు అవార్డ్స్ సొంతం చేసుకుంది. దీనితో ఈ విన్నింగ్ మూమెంట్ ని అయితే హీరో ప్రియదర్శి అయితే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేసాడు.

అంతే కాకుండా మరిన్ని అవార్డులు అయితే  వస్తాయని గర్వంగా చెప్పాడు. మరి ఈ సినిమాకి అయితే ఇది నిజంగా అర్హత కలిగినదే అని చెప్పడంలో సందేహం లేదు. కాగా ఈ సినిమాకి దిల్ రాజు సమర్పణలో రిలీస్ చేయగా భీమ్స్ సంగీతం అందించాడు.