ఓటిటి : ఈ 3 భాషల్లో “బలగం” వచ్చేసింది.!

ఈ ఏడాది టాలీవుడ్ లో వచ్చిన పలు భారీ బాక్సాఫీస్ హిట్స్ మరియు ఎమోషనల్ హిట్ సినిమాల్లో లేటెస్ట్ గా వచ్చిన ఓ సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ ని అలరిస్తూ భారీ వసూళ్లు రాబడుతూ వెళ్తుంది. ఆ సినిమానే “బలగం”. కాగా ఈ సినిమాలో హీరోగా ప్రియదర్శి హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారిన హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఊహించని దర్శకుడు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు.

కాగా ఈ సినిమా అయితే థియేటర్స్ లో స్ట్రాంగ్ రన్ తో కొనసాగుతున్నప్పటికీ ఓటిటి రిలీజ్ అంటూ షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. మరి ఇండియా లో అయితే ఈ సినిమా దిగ్గజ ఓటిటి యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులోకి రాగ ఓవర్సీస్ ఆడియెన్స్ కి అయితే సింప్లి సౌత్ లో వచ్చింది.

మరి ఇప్పుడు ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అయితే మొత్తం మూడు భాషల్లో రీలీజ్ కావడం విశేషం. ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగు తర్వాత తమిళ్ మరియు మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి తెచ్చినట్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కన్ఫర్మ్ చేశారు.

అయితే ఇంత త్వరగా స్ట్రీమింగ్ తో చాలా మంది డిజప్పాయింటింగ్ గా ఉన్నా మరికొందరు అయితే ఇక థియేటర్ కి వెళ్ళక్కర్లేదు ఓటిటి  లో చూసి ఎంజాయ్ చేస్తాం అని అనుకోని వారు కూడా లేకపోలేరు. ఇక ఈ సినిమాకి అయితే భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు.