రెండోసారి కూడా సెన్సేషనల్ రేటింగ్ రాబట్టిన “బలగం”.!

ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి వచ్చి పెద్ద హిట్ అయ్యిన చిత్రాల్లో అసలు ఊహించని ఘన విజయాన్ని నమోదు చేసిన చిత్రం “బలగం”. ఫామిలీ ఆడియెన్స్ ని ఓ రేంజ్ లో థియేటర్స్ లోకి రాబట్టిన ఈ చిత్రం భారీ వసూళ్లు కొల్లగొట్టి రికార్డు లాభాలు డిస్ట్రిబూస్టర్స్ కి అయితే అందించింది.

మరి కమెడియన్ వేణు అయితే దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ డ్రామాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ లు హీరో హీరోయిన్స్ గా నటించారు. మరి ఈ చిత్రం అయితే థియేటర్స్ లో భారీ సక్సెస్ తో పాటుగా అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా గెలిచి సత్తా చాటింది.

ఇక అక్కడ అలాగే ఓటిటి లో కూడా దుమ్ము లేపిన ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ గా స్మాల్ స్క్రీన్ పై కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని అయితే అందుకుంది. ఇక మొదటి సారి 14 కి పైగా టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ అందుకున్న ఈ చిత్రం రీసెంట్ టైం లో అయితే స్టార్ హీరో సినిమా కూడా అందుకోని ఆదరణ అందుకుంది.

ఇక రెండో సారి కూడా ఈ చిత్రం అదిరే రేటింగ్ నమోదు చేసినట్టుగా ఇప్పుడు బయటకి వచ్చింది ఇదే స్టార్ మా లో ఈ చిత్రం రెండోసారి టెలికాస్ట్ కి రాగ ఇప్పుడు 9.08 రేటింగ్ అందుకుంది. ఇది కూడా చిన్న మొత్తం అయితే కాదని చెప్పాలి.

మన స్టార్ హీరోల రెండో టెలికాస్ట్ లు అయ్యితే 6 పాయింట్స్ కూడా రావట్లేదు. అలాంటిది ఈ సినిమా ఇంత మొత్తంలో అందుకోవడం సెన్సేషన్ అని చెప్పాలి. అలాగే ఫామిలీ ఆడియెన్స్ లో ఈ సినిమా ఆదరణ కూడా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.