ఒకప్పుడు హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి అశేష ప్రేక్షాకదరణ పొందాడు నందమూరి బాలకృష్ణ. సాంఘిక, పౌరాణిక, జానపద ఇలా అన్ని రకాల జానర్స్‌ని టచ్ చేస్తూ సినిమాలు చేశారు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. అందులో కొన్ని మంచి విజయం సాధిస్తున్నాయి. మరి కొన్ని ఫ్లాపుల బాట పడుతున్నాయి. టీడీపీ ఎమ్మేల్యేగాను కొనసాగుతున్న బాలయ్య ఇటీవల విచిత్రమైన ప్రవర్తన, అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలతో వార్తలలో నిలుస్తున్నాడు. తాజాగా పోస్టర్ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన బాలయ్య చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ నవ్వుల పాలయ్యాడు.
హర్ష కనుమల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “’సెహరి” సినిమాకి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలయ్య ని పొగుడుతున్నప్పుడు విచిత్ర ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చిన బాలకృష్ణ పోస్టర్ లాంచ్ అప్పుడు హీరో చేతిని గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత తనకి కాల్ రాగా, జేబులో ఫోన్ తీసిన బాలయ్య కోపంతో విసిరేశాడు. దీంతో అక్కడ వారందరు ఆ సన్నివేశాన్ని చూసి నోరెళ్లపెట్టారు . ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాలయ్య వీడియోపై నెటిజన్స్ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. మీమ్స్ ,కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు. ఎవరి మీద కోపం ఎవరి మీద తీసావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సినిమా గురించి మాట్లాడిన బాలయ్య .. ప్రేమించండి అంటున్నాడు, అంతలోనే డోంట్ లవ్ అంటూ స్పీచ్ ఇచ్చాడు. ఇదేమి బాలయ్య నువ్వు మాట్లాడేది నీకు అన్న అర్దం అవుతుందా అంటూ ట్రోల్ చేస్తున్నారు. కరోనా వైరస్ గురించి మాట్లాడిన ఆయన దీనికి వ్యాక్సిన్ రాలేదు, ఇక రాదు అంటూ కూడా కామెంట్స్ చేశాడు. బాలయ్య వ్యాఖ్యలు విని ఆయన అభిమానులు కూడా తెగ ఫీలవుతున్నారు