హరీష్ శంకర్ ఖండించలేడు.. వివరణా ఇవ్వలేడు.!

పెద్ద కష్టమే వచ్చింది దర్శకుడు హరీష్ శంకర్‌కి. ‘భవదీయుడు భగత్ సింగ్’ అన్నాడు. దాన్నేమో ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా మార్చాడు. ఇప్పుడు అది కూడా ముందుకు కదిలేలా కనిపించడంలేదు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిపోయిందట కదా.. వేరే సినిమా చేసుకోమని పవన్ కళ్యాణ్ చెప్పాడట కదా.. అంటూ, హరీష్ శంకర్ టార్గెట్‌గా బోల్డన్ని కామెంట్స్ పడుతున్నాయ్.

రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమాకి లైన్ క్లియర్ అయ్యిందనీ, పవన్ సూచనతోనే హరీష్ ఈ నిర్ణయం తీసుకున్నాడనీ అంటున్నారు. అబ్బే, అలాంటిదేమీ లేదని హరీష్ శంకర్ ఖండించలేడు. అతని పరిస్థితి అలాంటిది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిపోతే, ఎప్పటికైనా తాను అనుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ తీస్తాననే గట్టి నమ్మకం లోలోపల హరీష్ శంకర్‌కి వుందట.