పూజా హెగ్డే కి బ్యాడ్ డేస్

ముకుందా మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ పూజా హెగ్డే. మొదటి సినిమా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ఇక రెండో మూవీని నాగ చైతన్యకి జోడీగా ఒక లైలా కోసం అనే మూవీ చేసింది. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. అదే సమయంలో హిందీలో హృతిక్ రోషన్ కి జోడీగా మొహెంజదారో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో మరల టాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది.

దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో బన్నీకి జోడీగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూజా హెగ్డే అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయి నెంబర్ వన్ చైర్ లోకి వచ్చేసింది. వరుసగా స్టార్ హీరోలతో ఈ అమ్మడు జత కట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్స్ తో ఆదిపాడింది.

అలాగే తమిళంలో విజయ్ కి జోడీగా బీస్ట్ చిత్రంలో నటించింది. వీటిలో చాలా వరకు సక్సెస్ అయ్యాయి. అయితే తెలుగులో స్టార్ హీరోయిన్ గా వరుస ఛాన్స్ లు వస్తోన్న సెలక్టివ్ గా మూవీస్ చేస్తూ హిందీపైన ఈ అమ్మడు ఫోకస్ పెట్టింది. అక్కడ రణవీర్ సింగ్ కి జోడీగా జోకర్ లో నటించింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. తర్వాత ఈ ఏడాదిలో సల్మాన్ ఖాన్ తో చేసిన కిసికి జాన్ కిసికా భాయ్ మూవీ కూడా ఘోర పరాజయం సొంతం చేసుకుంది.

ఇదే సమయంలో తెలుగులో ఆమెని ఛాయస్ గా అనుకున్న దర్శకులు అందరూ కూడా శ్రీలీల వైపు డైవర్ట్ అవుతున్నారు. ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా 10 సినిమాల వరకు కమిట్ అయ్యింది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఒక్క గుంటూరు కారం మాత్రమే ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి కమిట్ అయిన ఎందుకనో ప్రస్తుతం ఆ ఛాన్స్ శ్రీలీలకి చిక్కింది.

తమిళంలో కార్తికి జోడీగా పయ్యా 2 మూవీ మాత్రం గుంటూరు కారం తర్వాత పూజా హెగ్డే చేతిలో ఉంది. విజయ్ దేవరకొండతో ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. గుంటూరు కారం హిట్ అయితే మరల పూజా హెగ్డేకి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. మొత్తానికి ప్రస్తుతం మాత్రం పూజా హెగ్డే టైమ్ కాస్తా బ్యాడ్ స్టేజ్ లోనే ఉందని చెప్పాలి.