పవన్ కల్యాణ్ బర్త్ డే – 3 సూపర్ గిఫ్ట్ లు…!

Nikesha patel Special Wishes to Pawan Kalyan

సెప్టెంబర్ 2.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ అభిమానులకు పండుగ రోజు. పవన్ కల్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ ఎవరికీ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. పవన్ ఫ్యాన్స్ రేంజ్ ఏంటో? ఎన్నో సార్లు చూశాం మనం. ఇక.. ఆయన బర్త్ డే సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ఆయనకు భారీ స్థాయిలో శుభాకాంక్షలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన నటించిన సినిమాలు, పార్టీ కార్యక్రమాలు.. ఇతరత్రా అన్నింటినీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కల్యాణ్ గురించి వార్తలే.

back to back updates on occasion of pawan kalyan birthday
back to back updates on occasion of pawan kalyan birthday

ఇక.. ఆయన బర్త్ డే సందర్భంగా పవన్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా రానున్నాయి. పవన్ కల్యాణ్ ప్రస్తుతం పింక్ సినిమా రిమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ పేరుతో ఆ సినిమా రాబోతున్నది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్, సాంగ్ రిలీజ్ అయ్యాయి.

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన మరే అప్ డేట్ తెలియలేదు. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తికావచ్చింది. అయితే ఎలాగూ పవర్ స్టార్ బర్త్ డే ఉంది కాబట్టి.. ఆయన బర్త్ డే సందర్భంగా పవన్ ఫ్యాన్స్ కు ఒక అప్ డేట్ ఇవ్వడానికి మూవీ యూనిట్ సిద్ధమయిందట.

రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు వకీల్ సాబ్ కు సంబంధించిన ఒక అప్ డేట్ ను తెలియజేస్తారట. ఈసారి ఖచ్చితంగా సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తారేమో.. అని పవన్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా వకీల్ సాబ్ నుంచి రేపు వచ్చే అప్ డేట్ పవన్ ఫ్యాన్స్ కు మాంచి కిక్ ఇవ్వనున్నది.

మరోవైపు హరీశ్ శంకర్ తో పవన్ చేసే సినిమాపై కూడా అప్ డేట్ రేపు రానున్నది. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్టో తెలిసిందే. గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న సినిమా కావడం.. అదే కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ బుధవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రానున్నదట. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా రాబోతున్నది.

అలాగే క్రిష్ తో కూడా పవన్ ఓ సినిమా చేయబోతున్నారట. ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా రేపు రానుంది.

మొత్తం మీద వరుస పెట్టి పవన్ కల్యాణ్ సినిమాలు చేయడం పవన్ అభిమానులకు ఎంతో సంతోషానిచ్చే వార్త. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తన అభిమానులను అలరించడం కోసం పవన్ మళ్లీ వరుసగా సినిమాలు చేస్తుండటంతో పవన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.