అవినాష్ సేఫ్… నో ఎలిమినేషన్ … అభిమానుల్ని పిచ్చోళ్ళని చేసిన బిగ్ బాస్ !

avinash saved by eviction pass

బిగ్ బాస్ సీజన్ 4లో జబర్దస్త్ నుండి వచ్చిన అవినాష్ మొదట్లో తన కామెడీతో అలరించగా రాను రాను కొద్దిగా ఆడియెన్స్ కు దూరమవుతూ వచ్చాడు. లాస్ట్ వీక్ వచ్చిన ఎవిక్షన్ పాస్ ఈరోజు ఎలిమినేషన్ నుండి అవినాష్ ను నామినేట్ చేసింది. ఈవారం నలుగురు నామినేషన్స్ లో ఉండగా శనివారం మోనాల్ ను సేఫ్ చేసిన నాగార్జున ఈరోజు గెస్ట్ గా వచ్చిన సుదీప్ తో అఖిల్ ను సేఫ్ చేశారు.ఇక మిగిలిన ఇద్దరు అవినాష్, అరియానాలలో ఒకరు ఎలిమినేట్ ఒకరు సేఫ్ అవ్వాల్సి ఉంటుంది.

avinash

 అయితే అవినాష్ ఎవిక్షన్ పాస్ ఉండటం వల్ల నాగ్ అతనికి ఛాన్స్ ఇచ్చాడు. క్యాప్ లో రెడ్ వచ్చిన వచ్చి ఎవిక్షన్ పాస్ వాడుకున్నందుకు అవినాష్ ఎలిమినేట్ అయినా పాస్ వల్ల సేఫ్ అయ్యాడు. ఇక అరియానా ఆడియెన్స్ ఓటింగ్ ద్వారా సేఫ్ అయ్యాడు. ఫైనల్ గా ఈ వారం ఉన్న సూపర్ సెవెన్ అలానే ఉన్నారు. కేవలం ఎవిక్షన్ పాస్ ఉండటం వల్ల అవినాష్ సేఫ్ అయ్యాడు అది కూడా ఈ వారం తనకు తానే వాడుకోవడం వల్ల సేఫ్ అయ్యాడు.అవినాష్ సేఫ్ అయిన తర్వాత ఎమోషనల్ అవుతూ ఆడియెన్స్ దృష్టిలో తాను ఎలిమినేట్ అయినట్టే అని ఫీల్ అవుతున్నాడు. దానికి నాగార్జున కూడా అవినాష్ ను కన్విన్స్ చేయాలని చూశారు. ఫైనల్ గా అవినాష్ ఎవిక్షన్ పాస్ అతన్ని కాపాడగా ఇక రానున్న వారాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.