వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర అయితే భారీ గ్రాసర్ గా ఉన్న చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా “అవతార్ 1” అని తెలిసిందే. ఎప్పుడో 2009 లో వచ్చినప్పటికీ ఈ మైండ్ బ్లాకింగ్ విజువల్ ట్రీట్ అయితే ఇప్పుడుకి నెంబర్ 1 గ్రాసర్ గా అయితే నిలిచింది.
ఇక ఈ సినిమాకి సక్సెసర్ గా వచ్చిన లేటెస్ట్ చిత్రమే “అవతార్ 2”. దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఈ చిత్రం అవతార్ 1 కన్నా భారీ విజువల్స్ తో సరికొత్త ట్రీట్ ని అసలు 3 గంటలు ఉంది అన్నట్టుగా కూడా లేకుండా అదరగొట్టింది. అయితే ఈ సినిమాకి ఇప్పుడు స్ట్రాంగ్ వసూళ్లు ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్నాయి కానీ ఓ వెర్షన్ లో మాత్రం సినిమాకి నష్టాలు తప్పదని ట్రేడ్ విశ్లేక్షకులు అంటున్నారు.
మరి ఈ చిత్రం అయితే వరల్డ్ వైడ్ 3డి మరియు 2డి వెర్షన్ లలో రిలీజ్ అయ్యిన తెలిసిందే. కానీ ఆశ్చర్యకరంగా ఈ చిత్రం ఆడియెన్స్ అత్యధిక శాతం 3డి లోనే ఎక్కువ బుకింగ్స్ చేస్తున్నారట. 3డి కంపేర్ చేస్తే 2డి కి చాలా తక్కువ బుకింగ్స్ నమోదు అవుతుండగా ఆ వెర్షన్ కి జరిగిన బిజినెస్ లో అయితే చాలా నష్టం వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు.
అయితే ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ రన్ లో దూసుకెళ్తుంది. అయితే లాస్ట్ టైం అవతార్ 1 మాత్రం ఎలాంటి 3డి వెర్షన్ లేకుండా 2.9 బిలియన్ డాలర్స్ వసూలు చేయడం గమనార్హం. ఈ లెక్కన అవతార్ 2 అయితే ఎక్కడ ఆగుతుందో చూడాల్సిందే.