బాక్సాఫీస్ : తెలుగు స్టేట్స్ లో “అవతార్ 2” 3 డేస్ క్రేజీ వసూళ్లు.!

వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఏమో కానీ హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం అయినటువంటి “అవతార్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే అనుకున్నట్టు భారీ ఓపెనింగ్స్ అందుకోగా ఇండియన్ సినిమా దగ్గర కూడా రెండు రోజుల్లోనే ఏకంగా 100 కోట్లు మేర అందుకున్న ఈ చిత్రం..

మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మైండ్ బ్లాకింగ్ వసూళ్లు తో దుమ్ము రేపుతోంది అని చెప్పాలి. హిందీలో కూడా మన తెలుగులో వచ్చిన రేంజ్ వసూళ్లు రావట్లేదని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. జస్ట్ రెండు రోజుల్లో అవతార్ 2 చిత్ర 25 కోట్ల మేర గ్రాస్ ని అందుకోగా ఇక మూడో రోజు వసూళ్లతో అయితే ఏకంగా 37 నుంచి 40 కోట్ల మేర ని రాబట్టేసింది అట.

మరి ఇది మన సౌత్ ఇండియా మార్కెట్ లో ఏ భాషలో కూడా అవతార్ 2 కి తెలుగులో వచ్చిన వసూళ్లు రావట్లేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. దీనితో ఇండియన్ సినిమా దగ్గర చాలా వరకు తెలుగు వసూళ్లే దాదాపు 25 శాతం వరకు మన తెలుగు ప్రేక్షకులు వసూళ్లే కంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా అంటున్నారు.

మరి దీనితో తెలుగులో ఈ సినిమా ఈజీగా 50 కోట్ల మార్క్ ని క్రాస్ చేసేస్తుందని చెప్పొచ్చు. అలాగే మరో పక్క అయితే ఆల్రెడీ హాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇప్పటివరకు తెలుగులో హైయెస్ట్ గ్రాసర్ గా ఉండగా దాని లైఫ్ టైం వసూళ్లు అవతార్ 2 ఈజీగా బ్రేక్ చేసేసినట్టుగా అంటున్నారు.