అవతార్ 2 : ఇండియాలో సెన్సేషనల్ బుకింగ్స్ తో రికార్డు స్క్రీన్స్ రిలీజ్.!

ప్రపంచ సినిమా అంతా కూడా ఇప్పుడు జపం చేస్తున్న ఏకైక చిత్రం పేరు “అవతార్ 2”. దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇక వరల్డ్ వైడ్ రిలీజ్ తో పాటుగా ఇండియా లో కూడా ఈ చిత్రం మేజర్ బిజినెస్ జరిపి భారీ అంచనాలు మూటగట్టుకుంది.

అయితే ఇక రేపు మొత్తం 6 భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం పై అయ్యితే ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ఈ సినిమాకి ఇచ్చిన స్క్రీన్ లు అలాగే నమోదు అవుతున్న బుకింగ్స్ చెప్తున్నాయి. మరి ఈ చిత్రం ఇండియా లో టోటల్ గా అన్ని వెర్షన్ స్క్రీన్ లు కలిపి 4000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందట.

అంతే కాకుండా బుకింగ్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఒక్క ఆన్లైన్ లోనే ఏకంగా 4 లక్షల 80 వేల మేర టికెట్స్ ఇండియా లో అమ్ముడుపోయినట్టుగా తెలుస్తుంది. మరి ఇది 5 లక్షల టికెట్స్ కి కూడా టచ్ అవ్వొచ్చని అంటున్నారు. దీనితో అయితే ఓ హాలీవుడ్ సినిమాగా ఆల్ టైం రికార్డు స్క్రీన్స్ లో ఈ చిత్రం రిలీజ్ అవుతుండగా.. 

టికెట్ అమ్మకాల్లో కూడా ఇండియన్ సినిమాల రికార్డులను ఈ చిత్రం బద్దలుకొట్టినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ అవైటెడ్ మూవీ మొదటి రోజు మాత్రం అదిరే వసూళ్లు నమోదు చేస్తుందని చెప్పొచ్చు. అలాగే టాక్ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు.