అవతార్ 2 : జస్ట్ ఈ వెర్షన్ లోనే 1 బిలియన్ వసూళ్లు అట.!

గత డిసెంబర్ లో ప్రపంచ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన భారీ పాన్ వరల్డ్ సినిమా “అవతార్ ది వే ఆఫ్ వాటర్”. దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ని మరోసారి ఓ రేంజ్ లో మైమరపించగా వసూళ్లు కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా స్టాండర్డ్ గా వస్తున్నాయి.

మరి ఈ వసూళ్లు ఇప్పుడు ఏకంగా 2 బిలియన్ డాలర్స్ కి వచ్చేయగా ఇంకా ఈ వసూళ్లు వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర భారీగా కొనసాగుతుంది. అయితే గతంలో అవతార్ సినిమాకి ఇప్పుడు థియేటర్ లో ఉన్న ఎన్నో ఫెసిలిటీస్ లేకుండానే వరల్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు కాస్త పరిస్థితులు మారడంతో అవతార్ 2 లో 2డి అని 3డి అని అలాగే 4డి ఎక్స్ అని అనేక వెర్షన్స్ లో వచ్చింది. మరి వీటిలో ఈ చిత్రం జస్ట్ 3డి లోనే ఏకంగా 1 బిలియన్ డాలర్స్ అందుకున్నట్టుగా వరల్డ్ సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక మిగతా వెర్షన్స్ సహా ఐమ్యాక్స్ లు కలిపి ఇంకో 1 బిలియన్ మేర వసూళ్లు వచ్చాయి.

అయితే ఇప్పటికీ 3డి మరియు ఐమ్యాక్స్ లలో వసూళ్లు గట్టిగానే కొనసాగుతున్నాయి. దీనితో అవతార్ 2 మాత్రం ఇంకా భారీ మార్క్స్ అందుకుంటుంది అని తెలుస్తుంది. ఆల్రెడీ ఇండియా లో ఈ చిత్రం ఆల్ టైం హైయెస్ట్ గ్రాసింగ్ హాలీవుడ్ సినిమాగా నిలిచి ఆల్ టైం రికార్డు కూడా సెట్ చేసిన సంగతి తెలిసిందే.