ఇండియన్ వెర్షన్ “అవతార్ 2” ఎంతసేపు అంటే.!!

సరిగ్గా ఇదే డిసెంబర్ నెలలో గత పదమూడేళ్ల కితం ఓ సెన్సేషన్ వరల్డ్ సినిమా దగ్గర వచ్చింది. ఆ సినిమానే జేమ్స్ క్యామెరాన్ “అవతార్”. అత్యున్నత పాములతో అప్పట్లో భారీ విజువల్స్ తో అతి తక్కువ టికెట్ ధరలతో ఇప్పటికీ రికార్డు గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమాకి కొనసాగింపుగా అనౌన్స్ చేసిన చిత్రమే “అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్”.

ఇక దీనిపై నెలకొన్న అంచనాలు కూడా మాటల్లో చెప్పలేనివి అయితే ఇక సమయం దగ్గర పడుతున్న చిత్రం చిత్ర కోర్ టీం అంతా భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తూ ఉండగా ఇండియన్ వెర్షన్ అవతార్ కోసం కూడా అభిమానులు చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు.

ఇక మన ఇండియన్ వెర్షన్ లో అయితే అవతార్ 2 ఎంతసేపు ఉండడనుందో ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఈ చిత్రం ఏకంగా 192 నిముషాలు వచ్చేసిందట. అంటే సుమారు 3 గంటల 12 నిముషాలు పాటు ఈ చిత్రం థియేటర్స్ లో ఉండనుంది.

లాస్ట్ లో ఎలా లేదన్నా టైటిల్స్ ఓ 5 నుంచి 8 నిముషాలు కోసినా టోటల్ గా గంటల 10 నిముషాలు మేర థియేటర్స్ లో ఈ చిత్రం నడుస్తుంది. మరి ఇండియా లో అయితే ఈ చిత్రం యూ/ఏ గా సర్టిఫై అయ్యింది. దీనితో అయితే ఫైనల్ గా ఈ భారీ చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రపంచ ఆడియెన్స్ ముందుకు రావడానికి రెడీగా ఉంది.