వేల కోట్లతో “అవతార్ 2”.. వరల్డ్ వైడ్ మొదటి వారం వసూళ్లు.!

పాన్ వరల్డ్ సెన్సేషనల్ హిట్ సినిమా “అవతార్ 2” హవా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర నడుస్తుంది. మరి దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ భారీ విజువల్ ట్రీట్ అయితే వరల్డ్ వైడ్ మంచి అంచనాలు నడుమ వచ్చి మంచి టాక్ కూడా తెచ్చుకుంది అయితే వసూళ్లు పరంగా కూడా గట్టిగానే రాబడుతూ ఉండగా ఇక మొదటి వారం వరల్డ్ వైడ్ ఈ చిత్రం ఎంత వసూళ్లు రాబట్టింది అనేది ఇప్పుడు తెలుస్తుంది.

ట్రేడ్ వర్గాల లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఏకంగా 600 మిలియన్ డాలర్స్ మార్క్ ని అయితే క్రాస్ చేసి స్ట్రాంగ్ గా దూసుకెళ్తుందట. మరి ఈ 600 మిలియన్ డాలర్స్ అంటే 4 వేల 900 కోట్లకి పై మాటే అని చెప్పాలి. ఇక ఇది మొదటి వారమే కాగా లాంగ్ రన్ లో ఈ చిత్రం మరింత వండర్స్ హాలీవుడ్ నుంచి సృష్టించే ఛాన్స్ ఉందని కూడా చెప్పొచ్చు.

మరి ఈ భారీ చిత్రం ఫైనల్ రన్ లో ఎక్కడ ఆగుతుందో చూడాలి. ప్రస్తుతం అయితే ఇండియా లో కూడా స్ట్రాంగ్ గా కొనసాగుతున్న ఈ చిత్రం నార్త్ అమెరికా లో 183 మిలియన్ డాలర్స్ వసూలు చేయగా మిగతా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర 426 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. దీనితో ఈ చిత్రం మొత్తం 600 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది.