లేటెస్ట్ పాన్ వరల్డ్ సెన్సేషన్ సినిమా అవతార్ 2 ఇప్పుడు వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర నెమ్మదిగా భారీ మొత్తంలో గర్జిస్తూ ఊపందుకుంది. మరి మొదటి రోజే రికార్డు వసూళ్లు ఇండియా సహా చాలా ప్రాంతాల్లో నమోదు చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓ రేంజ్ లో మరింత స్థాయిలో బలపడుతున్నట్టుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
ఇక ఇండియా వెర్షన్ లోకి వస్తే మొదటి రోజు వచ్చిన 40 కోట్లకి పైగా గ్రాస్ లో మన తెలుగు రాష్ట్రాల నుంచే 14 కోట్ల మేర గ్రాస్ వచ్చేయగా ఇక రెండో రోజు కూడా అవతార్ 2 చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటినట్టుగా టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.
ఇక రెండో రోజు అయితే ఈ చిత్రం మళ్ళీ 13 నుంచి 14 కోట్లు మేర గ్రాస్ కలెక్ట్ చేయగా అందులో ఈ చిత్రం 24.5 కోట్ల మేర నెట్ వసూళ్లు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో రెండు రెండుల్లో కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి అవతార్ 2 24 కోట్లకి పైగా నెట్ వసూళ్లు తో దుమ్ము లేపినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.
మొదటి మార్నింగ్ షో లు మినహా అవతార్ 2 అయితే మ్యాట్నీల నుంచి ఓ రేంజ్ లో ఊపందుకుంటుందట. దీనితో ఆల్ మోస్ట్ అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ తోనే ఈ చిత్రం రన్ అవుతుండగా ఈ ఆదివారం కూడా మినిమమ్ 10 కోట్ల గ్రాస్ ఒక్క తెలుగు నుంచే వస్తుందని ట్రేడ్ వర్గాలు వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అయితే బాక్సాఫీస్ దగ్గర అవతార్ 2 బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పి తీరాలి.