పంద్రాగస్ట్‌ సినిమాల విడుదల.. వరుస సెలవుల కారణంగా నిర్మాతల ఉత్సాహం!

ఆగస్టు 15న స్వాతంత్య దినోత్సవం సందర్భంగా విడుదలయ్యే సినిమాల సంఖ్య పెరుగుతోంది. ఆగస్టు 15న ఇండిపెండెన్స్‌ డే సెలవు రోజు. ఆ తర్వాత శుక్ర, శని, ఆదివారాలు. సోమవారం రాఖీ పండుగ కావటంతో నిర్మాతలు సినిమాల విడుదలకు మొగ్గుచూపుతున్నారు. తొలుత ఇదే తేదీన అల్లు అర్జున్‌-సుకుమార్‌ ‘పుష్ప -2 ది రూల్‌’ సినిమా విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. అయితే రీ షూట్స్‌ కారణంగా ఈ సినిమా డిసెంబర్‌ 6కి వాయిదా పడిరది. దీంతో చిన్న, విూడియం రేంజ్‌ బడ్జెట్‌ సినిమాలు ఆగస్టు విడుదలకు పోటీ పడుతున్నాయి.

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. 2019లో ఇచ్చిన ’ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీకి ఇది సీక్వెల్‌. సంజరుదత్‌ విలన్‌గా నటిస్తున్న ’డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది.

అలాగే నివేదా థామస్‌, ప్రియదర్శి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ’35 ఇది చిన్న కథ కాదు’ మూవీ కూడా అదే తేదీన విడుదల అవుతోంది. ’మ్యాడ్‌’ సినిమాతో తెరంగ్రేటం చేసిన ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌ హీరోగా వస్తున్న రెండో సినిమా ’ఆరు’ కూడా అదే రోజున విడుదల అవుతోంది. తాజాగా ఈ లిస్టులోకి ’మిస్టర్‌ బచ్చన్‌’ మూవీ కూడా వచ్చి చేరింది. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా రూపుదిద్దుకుంది.

బాక్సా ఫీసు వద్ద రామ్‌, రవితేజ ఇద్దరూ పోటీపడటం ఇది రెండోసారి. 2021లో రామ్‌ పోతినేని ’రెడ్‌’ మూవీ, రవితేజ ’క్రాక్‌’ మూవీ కూడా సంక్రాంతికే విడుదలై హిట్టుగానూ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచాయి. కోలీవుడ్‌లో విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన ’తంగలాన్‌’ మూవీ కూడా ఆగస్టు 15నే విడుదలవు తోంది. మాళవిక మోహనన్‌ ముఖ్యపాత్రలో నటించారు.