బిగ్ బాస్ 4: ఫినాలేలో పాల్గొనే అరుదైన అవ‌కాశం.. ఏం చేయాలి అంటే…!

విదేశాల‌లో ప్రాముఖ్య‌త పొందిన బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ఇప్పుడు మ‌న దేశంలోను ర‌చ్చ చేస్తుంది. తెలుగులో మూడు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో ప్ర‌స్తుతం నాలుగో సీజ‌న్‌ని జ‌రుపుకుంటుంది. మొద‌టి సీజ‌న్‌ని ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో రోజు నాని, మూడు, నాలుగు సీజ‌న్స్‌కు నాగార్జున హోస్ట్‌గా ఉన్నారు. క‌రోనా వ‌ల‌న ఈ ఏడాది బిగ్ బాస్ కార్య‌క్ర‌మం జ‌ర‌గడం క‌ష్ట‌మ‌ని అంద‌రు భావించిన త‌రుణంలో నిర్వాహ‌కులు దీనిని ప్ర‌స్టేజియ‌స్ గా తీసుకొని స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు.

19 మంది స‌భ్యుల‌ని షో స్టార్ట్ కాక‌ముందు 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచి బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపారు. ప్ర‌తి విష‌యంలోను క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ షోని 105 రోజుల పాటు ఎలాంటి అవాంత‌రాలు లేకుండా నిర్వ‌హించారు. త‌ల్లితండ్రులు, బ‌య‌ట‌కు వెళ్లిన కంటెస్టెంట్స్ తిరిగి లోప‌ల‌కి వ‌చ్చిన‌ప్పుడు కూడా ప్ర‌త్యేక గ్లాస్ రూం ఏర్పాటు చేసి దాని ద్వారానే ఇంట్లోని హౌజ్‌మేట్స్ తో మాట్లాడే అవ‌కాశాన్ని క‌ల్పించారు. మొత్తానికి స‌క్సెస్ ఫుల్‌గా సాగిన బిగ్ బాస్ సీజ‌న్ 4 రేపు గ్రాండ్ ఫినాలే జ‌రుపుకోనుండ‌గా, సాయంత్రం ఆరుగంట‌ల‌కు స్టార్ మాలో ఇది ప్ర‌సారం కానుంది.

ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజ‌రు అవుతారని వార్త‌లు వినిపిస్తుండ‌గా, కొంద‌రు అందాల భామ‌లు కూడా బిగ్ బాస్ స్టేజ్ పై సంద‌డి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే ప్రేక్ష‌కులు కూడా ఫినాలేలో పార్టిసిపేట్ చేసే అవ‌కాశం నిర్వాహ‌కులు క‌ల్పిస్తున్నారు. అందుకు చేయ‌వ‌ల‌సింది #BBTeluguGrandFinale అని ట్వీట్ చేయ‌డ‌మే. ఇలా ట్వీట్ చేసిన కొంద‌రికి బిగ్ బాస్ ఫినాలేలో పార్టిసిపేట్ చేసే అవ‌కాశం ద‌క్కుతుంది. ఆదివారం సాయంత్రం ఆరు గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న ఈ షో ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డం ఖాయం అంటున్నారు